Meghaalu Lekunna Song | Kumari 21F - Yazin Nizar Lyrics


Singer Yazin Nizar
Music Devi Sri Prasad
Song Writer Sri Mani, Ananta Sriram
మేఘాలు లేకున్నా, నా పైన ఈ వాన,
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా, నే తేలిపోతున్నా,
ఈ మాయలన్నీ నీ వల్లేనా
వెళ్ళే దారిలో, లేడే చంద్రుడే,
ఐనా వెన్నెలే, అది నీ అల్లరేనా
ఓ' చెట్టు నీడనైనా లేనే పైన పూల వాన
మేఘాలు లేకున్నా, నా పైన ఈ వాన,
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా, నే తేలిపోతున్నా,
ఈ మాయలన్నీ నీ వల్లేనా
కోపముంటే నేరుగా చూపకుండా ఇలా
రాత్తిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా
మేలుకున్నా కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పొలమారుతుంటె అసలింత జాలి లేదా
నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా
మేఘాలు లేకున్నా, నా పైన ఈ వాన,
రాగాలు తీసే నీ వల్లేనా
మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా గిల్లిచెప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ' మన మధ్య దారంకైనా దారి ఎందుకంటా
మేఘాలు లేకున్నా, నా పైన ఈ వాన,
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా, నే తేలిపోతున్నా,
ఈ మాయలన్నీ నీ వల్లేనా
ఓ.ఉ.ఒ.హో